టాప్ ట్రెండింగ్ కథనాలు

తొమ్మిది రహస్యాలు



కొన్ని విషయాలను పైకి చెప్పుకోకుండా ఉంటేనే వ్యక్తి యొక్క గౌరవం నిలబడుతుంది. బైట వారికి చెప్పకూడని ఇలాంటి తొమ్మిది విషయాలు ఈ శ్లోకంలో చెప్పబడ్డాయి.

*”ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం రహస్యం మంత్రమౌషధమ్”*
*”తపో దానావమానే చ నవ గోప్యాని కారయేత్”*

“హితోపదేశం ఆయుష్షు, ఆదాయాదులు, ఇంట్లోని కలహాలు, వ్యక్తి గత రహస్యాలు (తనకే తెలిసిన లోపాలు), మంత్రం, ఔషథం, తపస్సు, దానం, అవమానం ఈ తొమ్మిది విషయాలు గోప్యంగా ఉండాలి.”

మనం ఇతరులతో బాహాటంగా చర్చ చేయకూడని విషయాలలో మొదటిది మన ఆయువు (జీవించే కాలం) మనకున్న డబ్బు, అప్పు, ఆదాయం మొదలైన ఆర్థిక విషయాలను అనవసరమైన వారి ముందు ఏకరువు పెట్టడం తగదు. డబ్బు ఉందని తెలిస్తే ‘అప్పు’ అడిగే వారుంటారు. అప్పులున్నాయని తెలిస్తే దూరమయ్యే వారుంటారు.

అలాగే భార్యాభర్తల మధ్య వచ్చిన ‘టీ’ కప్పులో తుఫాన్ వంటి గృహకలహాలను అవసరంలేని వారికి చెప్తే, అది నాలుగు గోడలు దాటుతుంది. సమస్య పరిష్కారం జటిలమవుతుంది. జాగ్రత్త అంటారు పెద్దలు.

అలాగే మిత్రుడు కదా అని సాంసారిక రహస్యాలనో, ఇతర రహస్యాలనో చెప్పేసామనుకో! స్నేహం చెడితే? అంతెందుకు! ఓ రహస్యం చెప్పాక, ఆ మిత్రుడు ఆ రహస్యాన్ని ఎక్కడ బయటపెడతాడోనన్న భయం మనల్ని వెంటాడుతుంది – “అడుసు త్రొక్కనేల….?” ముందే జాగ్రత్త పడమంటుంది శాస్త్రం.

అలాగే మనకి గురువులు ఉపదేశించిన మంత్రాన్ని బహిర్గతం చెయ్యకూడదు. మరొకటి ఔషథం మనకున్న అనారోగ్యానికి వాడుతున్న మందుల గురించి అందరితో చర్చించకూడదు. దానివల్ల ఒక్కొక్కరు, ఒక్కో సలహా ఇస్తుంటారు.

ఇలా బట్టబయలు చేయకూడని అంశాలను మనుస్మృతిలో ఎంతో తెలివిగా అందించారు. ఆ తర్వాత మన ఇష్టం.

How did this article make you feel? ఈ కథనం మీకు ఎలా అనిపించింది?

Leave a Comment

error: Content is protected !!