టాప్ ట్రెండింగ్ కథనాలు

అన్నదానం మహిమ …

వేయి ఏనుగులు, కోటి ఆవులు, లెక్కకు మిక్కిలి బంగారం, వెండి, భూములు, జీవితం మొత్తం ఓ వంశానికి సేవ చేయడం, కోటి మంది మహిళలకు వివాహం చేసినా అన్నదానానికి సాటిరావు.
అన్నదానం గురించి పదిమందికి తెలియపరచండి.

‘అన్నం’ గురించి నలుగురు మంచి మనుషులు చెప్పిన నాలుగు గొప్ప మాటలు…

1. ” నేను వంటింట్లోకి వేరే పనిమీదవెళ్ళినా కూడా , వంట చేస్తున్న మా అమ్మగారు.  ” పెట్టేస్తా నాన్నా ఒక్క అయిదు నిముషాలు ” అనేవారు నొచ్చుకుంటూ-   నేను అన్నం కోసం వచ్చాననుకుని !  ఎంతయినా అమ్మ అంటే అన్నం.  అన్నం అంటే అమ్మ ! అంతే !  – జంధ్యాలగారు

2. మంచి భోజనం లేని పెళ్ళికి వెళ్ళటం – సంతాపసభకి వెళ్ళినదానితో సమానం !   –  విశ్వనాధ సత్యనారాయణ గారు

3. రాళ్లు తిని అరిగించుకోగల వయసులో వున్నప్పుడు తినటానికి మరమరాలు కూడా దొరకలేదు !  వజ్రాలూ , వైడూర్యాలూ  పోగేసుకున్న ఈ వయసులో  మరమరాలు కూడా అరగట్లేదు ! అదే విధి !  – రేలంగి వెంకట్రామయ్య గారు

4. ఆరురోజుల పస్తులవాడి ఆకలి కన్నా,   మూడురోజుల పస్తులవాడి ఆకలి మరీ ప్రమాదం ! ఆహారం దొరికినప్పుడు ముందు వాడ్నే తిననివ్వాలి !  –  ముళ్ళపూడి వెంకటరమణ గారు

5. ఏటా వందబస్తాల బియ్యం మాకు ఇంటికి వచ్చినా మా తండ్రిగారు ” అన్నీ మనవికావు నాయనా ” అని బీదసాదలకి చేటలతో పంచేసేవారు.  అన్నీ మనవికావు అనటంలో వున్న వేదార్ధం నాకు పెద్దయితేనేగానీ  అర్ధం కాలేదు !  – ఆత్రేయ గారు

6. అమ్మ చేతి  అన్నం తింటున్నాను అని చెప్పగలిగినవాడు ధన్యుడు !   – చాగంటి కోటే శ్వర రావుగారు

7.  ఆకలితో వున్న వాని మాటలకు ఆగ్రహించవద్దు ! – గౌతమ బుద్దుడు

8. ఆత్మీయులతో కలసి తినే భోజనానికి రుచి ఎక్కువ ! చారుకూడా అమృతంలా రుచిస్తుంది ! – మాతా అమృతానందమయి

9. మీ పిల్లలు ఎంతదూరంలో,  ఎక్కడవున్నా , వేళపట్టున ఇంత అన్నం తినగలుగుతున్నారంటే అది వాళ్ళ గొప్పాకాదూ , మీ గొప్పాకాదు  మీ పూర్వీకుల పుణ్యఫలమే అని  గుర్తించు.   “అన్ని దానము లలో  అన్నదానము మిన్న “

How did this article make you feel? ఈ కథనం మీకు ఎలా అనిపించింది?

1 thought on “అన్నదానం మహిమ …”

Leave a Comment

error: Content is protected !!