టాప్ ట్రెండింగ్ కథనాలు

ఇంతకీ మీది ఏ స్నానం ??

🙏🌷 రుషి స్నానం,
🙏🌷 దేవ స్నానం,
🙏🌷 మానవ స్నానం,
🙏🌷 రాక్షస స్నానం…

        🌷ఇంతకీ మీది ఏ స్నానం…? 🌷

🌿బారెడు పొద్దెక్కినా నిద్ర లేవ‌కుండా ప‌డుకోవ‌డం ఇపుడు సిటీల‌లోనే కాదు… ప‌ల్లెటూళ్ళ‌లోనూ ఫ్యాష‌న్‌గా మారింది.

🌸అర్థరాత్రి వ‌ర‌కు సినిమాలు, టీవీలు, ఛాటింగుల‌తో గ‌డిపేసి… ఉద‌యం ఎంత‌కీ నిద్ర‌లేవ‌రు.

🌿సూర్యుడు న‌డినెత్తిన చేరిన త‌ర్వాత స్నానం చేస్తుంటారు.
కానీ, ఇది మంచి ప‌ద్ధ‌తి కాదుంటున్నాయి శాస్త్రాలు. అస‌లు స్నానం ఎపుడు చేయాలి…?
దాన్నిబట్టి ఉండే ఫ‌లితాలు ఇవిగో…

🌸తెల్లవారుజామున 4-5 గంటల మధ్య స్నానం చేయడం అత్యుత్తమం. దీన్ని రుషిస్నానం అంటారు.

🌿5 నుంచి 6 గంటల మధ్య చేసే స్నానాన్ని దేవస్నానం అంటారు. ఇది మధ్యమం.

🌸ఇక 6 నుంచి 7 గంటల మధ్య చేసే స్నానాన్ని మానవ స్నానం అంటారు. ఇది అధమం.

🌿ఇక 7 గంటల తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటారు.
ఇది అధమాతి అధమం.

🌸కాబట్టి ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి, రుషిస్నానం చేయడం పుణ్యప్రదం.

🌿ఇక స్నానాల్లోకెల్లా చన్నీటి స్నానం ఉత్తమమైనది.

🌸ప్రవాహ ఉదకంలో స్నానం చేయడం ఉత్తమోత్తమం.

🌿చెరువులో స్నానం మద్యమం నూతి(బావి) వద్ద స్నానం చెయడం అధమం.

🌸వేయి పనులున్నా వాటిని వదిలి సమయానికి స్నానం చేయాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.

🌿ఒక నదిలో స్నానం చేసినప్పుడు ఇంకో నదిని దూషించకూడదు.

🌸కొన్ని స్పాలలో, ఆయుర్వేదశాలల్లో చాకొలేట్, మట్టి వంటి ఇతర పదార్థాలతో స్నానం చేయటానికి ప్రత్యేక వసతులు ఉంటాయి.
షాంపేనుతో స్నానం చేసిన ఉదాహరణలు అక్కడక్కడా కనిపిస్తాయి.

🌸అంతేకాకుండా ఆరుబయట సూర్యుని కిరణాలు శరీరాన్ని తాకేట్టు పరుండటాన్ని కూడా స్నానంగా పరిగణిస్తారు.
ఈ సూర్య స్నానం (సన్ బాతింగ్) ముఖ్యంగా పాశ్చాత్య ప్రజలలో ప్రసిద్ధి చెందినది.

🌷పురాణాలలో స్నానం :🌷

🌿మానవుల్ని పవిత్రులను చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినది జలం, అగ్ని. అగ్నితో శుద్ధి చేసుకోవడం వీలుబడదు.

🌸అగ్ని యందలి దాహక శక్తి మనల్ని దహింప చేస్తుంది కనుక జలముతో శుద్ధి చేసుకోవడం అందుబాటులో ఉన్న శాస్త్ర సమ్మతమైన విషయంగా చెప్పబడింది. హిందూ పురాణాలలో వివిధ రకాలైన స్నానాల గురించి చెప్పబడింది.

🌷మంత్ర స్నానం:🌷

🌿వేదమందు చెప్పబడిన నమక, చమక, పురుష సూక్తములను, మార్జన మంత్రములను ఉచ్ఛరిస్తూ చేయునది “మంత్ర స్నానం”

🌷భౌమ స్నానం :🌷

🌸పుణ్య నదులలో దొరుకు మన్ను లేక పుట్టమన్ను మొదలగు పవిత్ర మృత్తికను ఒంటి నిండా అలముకొని మృత్తికా మంత్రాలతో చేసేది “భౌమ స్నానం”.

🌷ఆగ్నేయ స్నానం:🌷

🌿సమస్త పాపములను దగ్ధం చేసే పుణ్య రాశిని చేకూర్చే భస్మమును మంత్ర సహితంగా లేదా శివ నామమును ఉచ్ఛరిస్తూ ధరించి చేసేది “ఆగ్నేయ స్నానం”

🌷వాయువ్య స్నానం:🌷

🌸ముప్పది మూడు కోట్ల దేవతులు నివశించు గోమాత పాద ధూళి చేత చేసేది “వాయువ్య స్నానం”

🌷దివ్య స్నానం:🌷

🌿లోక భాంధవుడు, జగత్ చక్షువు, కర్మ సాక్షి అగు సూర్య భగవానుడు ఆకాశంలో ఉండి సూర్య కిరణాలను వెలువరిస్తున్నపుడు వానలో స్నానం చేయడం “దివ్య స్నానం”.
ఇది అరుదైనది. దీనికి వాతావరణం అనుకూలించాలి.

🌷వారుణ స్నానం:🌷

🌸పుణ్య నదులలో స్నానం ఆచరించడం
“వారుణ స్నానం”.

🌷 *మానస స్నానం :🌷

🌿నిత్యం నారాయణ నామ స్మరణతో కామ క్రోధ లోభ మోహ మద మత్సర అహంకార ఢంభ దర్పదైన్యాది మాలిన్యాలను మనస్సులో చేరనీక పోవడం “మానస స్నానం”.

🌸ఇది మహత్తర స్నానం.
మహా ఋషులచేత ఆచరింప బడుతుంది. ఈ స్నానం కోసం అందరూ ప్రయత్నం చేయాలి.

              🌹స్నానాలు రకాలు🌹

🌷మానస స్నానం:🌷

🌿దైవాన్ని స్మరిస్తూ, మనసును నిలిపి చేయు స్నానం.

🌷క్రియాంగ స్నానం:🌷

🌸జపం, మంత్రతర్పణ చేయుటకు చేసే స్నానం.

🌷దైవ స్నానం:🌷

🌿ఉదయం 4-5 గంటల మధ్య చేయు స్నానం.

🌷మంత్ర స్నానం:🌷

🌸వైదిక మంత్రాలను చదువుతూ చేసే స్నానం.

🌷రుషి స్నానం:🌷

🌿ఉదయం 5-6 గంటల మధ్య చేయు స్నానం.

🌷మానవ స్నానం:🌷

🌸ఉదయం 6-7 గంటల మధ్య చేయు స్నానం.

🌷రాక్షస స్నానం:🌷

🌿ఉదయం 7 గంటల తరవాత చేసే స్నానం.

🌷ఆతప స్నానం:🌷

🌸ఎండలో నిలబడి శరీరాన్ని శుద్ధి చేసుకునే స్నానం.

🌷మలాపకర్షణ స్నానం:🌷

🌿మాలిన్యం పోవుటకు చేయు స్నానం…🚩🌞🙏🌹🎻

How did this article make you feel? ఈ కథనం మీకు ఎలా అనిపించింది?

Leave a Comment

error: Content is protected !!