మనిషికి దుఃఖం ఎందుకు కలుగుతుంది? దాన్ని నివారించే మార్గం ఏదైనా ఉందా? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ముందుగా అసలు దుఃఖమంటే ఏంటో తెలియాలి. దాని స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయో అర్ధం చేసుకోవాలి. తైత్తిరీయ ఉపనిషత్తులోని సాంఖ్య దర్శనంలో దీనికి సంబంధించి ప్రామాణిక వివరణ కనిపిస్తుంది. మనుషులకు కలిగే దుఃఖాలు మూడు… ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం. మనిషిలో రజోగుణ ప్రకోపం ఎక్కువైనప్పుడు కలిగే ఈ మూడింటికీ కాస్త పరిణామ భేదం ఉంటుంది తప్ప అన్నీ ఒక కోవకు చెందినవే.
ఎవరికి వారుగా చిన్నపాటి ప్రయత్నంతో, సులభంగా దుఃఖాన్ని పోగొట్టుకోవచ్చని సాంఖ్యశాస్త్రం చెబుతోంది. తమను తాము తరచి చూసుకోవడం ద్వారా, ఆలోచనలను సంస్కరించుకోవడం సాధ్యమేనంటోంది. ద్వారా అది
ఆధ్యాత్మిక దుఃఖం… శారీరకం, మానసికం అని రెండు రకాలు. శారీరక అనారోగ్యం కారణంగా కలిగే దుఃఖం- వైద్యుణ్ని సరైన మందు తీసుకుంటే ఉపశమిస్తుంది. అరిషడ్వర్గాలవల్ల కలిగే దుఃఖం మానసికం. ఏ మనిషైనా ఫలానాది నాకు కావాలనుకోవడంలో తప్పులేదు. కానీ స్థాయిని మర్చిపోయి అందని ద్రాక్షకోసం అర్రులు చాచకూడదు. తెల్లారేసరికల్లా అపర కుబేరుడిగా మారిపోవాలనుకోవడం అజ్ఞానం. కోటీశ్వరుడు కావాలనుకోవడం తప్పుకాదు. కానీ, దానికోసం శ్రమించకుండా అప్పనంగా సంపద ఒళ్లో పడాలనుకోవడం అవివేకం. ఇలాంటి అనుచితమైన కోరికలవల్ల మనసుకు దుఃఖం కలుగుతుంది. వీలైనంత ప్రశాంతంగా ఉండాలి. మంచిగా ఆలోచించాలి. ఇతరుల అభివృద్ధిని చూసి సంతోషించాలి. అరిషడ్వర్గాలవల్ల కలిగే దుఃఖానికి ఇవే తగిన ఔషధాలు.ఆదిత్యయోగీ.
రెండో రకమైన దుఃఖం ఆది భౌతికం. ఇది మనుషులు, పాములు, తేళ్లు, సింహాలవంటి ప్రాణులవల్ల కలుగుతుంది. క్రూరమృగాలకు దూరంగా ఉండొచ్చు కానీ మనుషులకు దూరంగా ఎలా ఉండగలం! ‘నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ’ అని శతకకారుడు చెప్పినట్టుగా చెడ్డవారికి దూరంగా ఉండాలి. మన గురించి చెడుగా ఆలోచించేవారు చాలామంది ఉండొచ్చు. అది వాళ్ల లోపం. వాళ్ల గురించి, వాళ్ల చర్యల గురించి పదే పదే ఆలోచించి, బాధపడటం ఎందుకు… అనే సత్యాన్ని తెలుసుకుంటే ఈ విధమైన దుఃఖం నుంచి విముక్తి కలుగుతుంది. వివేచన అంటే అదే. ఈ నిజాన్ని తెలుసుకోలేకపోతే అవతలివాళ్లు చేసే చేటుకంటే ఎవరికివారు చేసుకునే చేటే ఎక్కువ.
మూడో రకమైన దుఃఖం ఆది దైవికం. ఇది యక్ష, రాక్షస, గ్రహావేశాలవల్ల కలిగే దుఃఖం. మన జీవితం మన చేతిలో ఉండాలి. మన ఉపాసన బలం మనకుండాలి. మంచి నడవడిక, నిర్మలమైన మనసు ఉంటే భగవంతుడి అండ ఎప్పటికీ ఉంటుంది. అవే నిర్మలమైన ఆనందానికి హేతువులు. ఈ నిజాన్ని తెలుసుకోవటమే దుఃఖనివారణకు సిసలైన మార్గం..*
.
అనులోమ-విలోమ అద్భుతం సాధకుడికి ఒక అమృతం లాంటిది
అనులోమ-విలోమ అనేది కేవలం ఒక శ్వాస వ్యాయామం మాత్రమే కాదు…
మీలోని చెల్లాచెదురైన శక్తిని సమతుల్యం చేయడానికి ఇది ఒక దివ్య ప్రక్రియ.
మీరు అనులోమ-విలోమ సాధన చేస్తున్నప్పుడు, మీరు కేవలం శ్వాస తీసుకోవడం మాత్రమే చేయడం లేదు…
మీరు మీలోని సూక్ష్మ శక్తి నాళాలను (నాడులను) శుద్ధి చేసుకుంటున్నారు,
మనస్సును సమతుల్యం చేసుకుంటున్నారు,
మరియు క్రమంగా మీ నిజ స్వరూపానికి మరింత దగ్గరవుతున్నారు.
అనులోమ-విలోమ యొక్క అద్భుత ప్రయోజనాలు:
మనస్సు ప్రశాంతమవుతుంది; ఆలోచనలు తగ్గుముఖం పడతాయి.
కోపం, ఆందోళన మరియు భయం క్రమంగా తొలగిపోవడం మొదలవుతాయి.
ఏకాగ్రత మెరుగుపడుతుంది — నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టత వస్తుంది.
శరీరంలోని శక్తి (ప్రాణం) ప్రవాహం సమతుల్యమవుతుంది.
నిద్ర మెరుగుపడుతుంది; జీవితంలో ఒక ప్రశాంతత నెలకొంటుంది.
ధ్యానం చేయడం సులభమవుతుంది.
అనులోమ-విలోమను క్రమం తప్పకుండా సాధన చేసే వ్యక్తి…
ఒక ప్రత్యేకమైన ప్రశాంతతను మరియు ముఖంపై ఒక విశిష్టమైన తేజస్సును వెదజల్లుతాడు.
కానీ కేవలం జ్ఞానం ఉంటే సరిపోదు — సంకల్పం అత్యవసరం.
ఈ రోజు, మీతో మీరు ఒక నిజాయితీతో కూడిన సంకల్పం చేసుకోండి:
“ఏది ఏమైనా సరే, నేను ప్రతిరోజూ అనులోమ-విలోమ సాధన చేస్తాను.ఆదిత్యయోగీ.
మనస్సు రకరకాల సాకులు సృష్టిస్తుంది…
కొన్నిసార్లు మీకు సమయం దొరక్కపోవచ్చు; కొన్నిసార్లు బద్ధకం ఆవహించవచ్చు…
కానీ తన సంకల్పంపై స్థిరంగా నిలిచే సాధకుడు మాత్రమే నిజమైన పురోగతిని సాధిస్తాడు.
దీనిని ఒక నియమంగా చేసుకోండి:
ఉదయం నిద్రలేవగానే వెంటనే — 10 నిమిషాల అనులోమ-విలోమ.
రాత్రి నిద్రపోవడానికి ముందు — 10 నిమిషాల అనులోమ-విలోమ.
కేవలం 10 నిమిషాలు మాత్రమే…
కానీ పూర్తి జాగరూకతతో మరియు సంపూర్ణ అంకితభావంతో.
గుర్తుంచుకోండి:
ఒక చిన్న సంకల్పాన్ని, ప్రతిరోజూ పాటిస్తే…
ఏదో ఒక రోజు అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేయగలదు.
ఈ రోజే ప్రారంభించండి…
ఇప్పుడే ప్రారంభించండి…
మరియు మీతో మీరు ఇలా చెప్పుకోండి:
“నా జీవితాన్ని మార్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను….*
ఓం నమఃశివాయ 🙏🙏🙏
How did this article make you feel? ఈ కథనం మీకు ఎలా అనిపించింది?


