టాప్ ట్రెండింగ్ కథనాలు

హే కృష్ణా …

గోకులంలో ఒక ఆమె బావి దగ్గర నీళ్ళు తోడుతోంది. కుండ నిండగానే ఎవరైనా ఆ కుండ తల మీద ఎత్తిపెడతారేమో అని ఇటూ అటూ చూసింది. అటుగా వెళుతున్న శ్రీ కృష్ణుడు కనిపించాడు. “కృష్ణా కృష్ణా” అని పిలిచింది. కృష్ణుడు వినిపించనట్టు వెళిపోయాడు. వీడీకేమయింది అనుకుంటూ ఎలాగోలా కుండ ఎత్తుకొని ఇంటికి చేరుకుంది. అక్కడ ఆమె కన్నా ముందు కృష్ణుడు చేరుకొని ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు!

“రా కుండ దించి పెడతాను” అన్నాడు

ఆమె ఆశ్చర్యం తో అడిగింది. “అప్పుడు పిలిస్తే రాకుండా ఇప్పుడు పిలవకుండా వచ్చి కుండ దించి పెడతాను అంటున్నావు. నాకేం అర్ధం కాలేదు కృష్ణా “అంది.

కృష్ణుడు నవ్వి “నేను భారం దించేవాడిని భారం ఎక్కించడం నా పని కాదు “అని వెళిపోయాడు.

కృష్ణం వందే జగద్గురుం !

How did this article make you feel? ఈ కథనం మీకు ఎలా అనిపించింది?

error: Content is protected !!