టాప్ ట్రెండింగ్ కథనాలు

బుద్ధుడి వ్యవసాయం

బుద్ధుడు కపిలవస్తులో బస చేసి ఉన్నాడు. వ్యవసాయం చేసుకునే ఒక పండితుడు ఆయన దగ్గరికి వెళ్లి, ‘స్వామీ! మీరూ మాలాగా పంటలు పండించి ఆ ఫలాల్ని మీరనుభవించి నలుగురికీ పంచిపెట్టవచ్చు కదా.

సోమరిగా, పరాన్నభుక్కులా ఎందుకు జీవిస్తున్నారు?’ అని అడిగాడు.

దానికి బుద్ధుడు ప్రసన్న దరహాసంతో ‘పండితోత్తమా! నేనూ కృషీవలుణ్నే.

🌿ధర్మక్షేత్రమే నా వ్యవసాయ భూమి!

🌿దాన్ని జ్ఞానమనే నాగలితో దున్నుతాను.

🌿శ్రద్ధ, పవిత్రత అనే విత్తనాలు చల్లుతాను.

🌿అనవసరపు కోరికలు అనే కలుపుమొక్కలు పీకిపారేస్తాను.

🌿మంచి కర్మలు అనే వర్షపు నీటితో అన్ని దుఃఖాల్ని హరించే నిర్వాణ ఫలాల్ని పండిస్తున్నాను. ఇది చాలదంటావా?

🌿మనిషి అన్ని దుఃఖాలకు కారణం కోరికలు, ఆశలు.

👉వాటి నుంచి బయటపడకుంటే మనశ్శాంతి ఉంటుందా? అందుకే, మానవ హృదయ క్షేత్రంలో రాగ, ద్వేష, మోహాల్ని, తృష్ణల్ని నశింపజేసే కృషి చేస్తున్నాను’ అన్నాడు బుద్ధుడు.

ఆ మాటలతో తథాగతుడి పట్ల పండితుడికి వ్యతిరేకత మాయమయ్యింది. వెంటనే ఆయన అనుయాయిగా మారిపోయాడు.

How did this article make you feel? ఈ కథనం మీకు ఎలా అనిపించింది?

error: Content is protected !!