శ్రీ గురు దేవాయ నమః👏 పత్రం, పుష్పం, ఫలం తోయం, యోమే భక్త్యా ప్రయచ్చతి
తదహం భక్త్యు ప్రహృతమస్నామి ప్రయతాత్మనః ( భగవద్గీత )
సామాన్యమైన అర్థం ఏమిటంటే :-
భగవంతునికి పత్రం, పుష్పం, ఫలం, జలం సమర్పించి పూజ చేయమని.:-
కానీ అంతరార్థం ఏమిటంటే అంతఃకరణాలైన మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం మాత్రమే, భగవంతుడు సమర్పించు అని చెప్పాడు.
➡ పత్రం — మనస్సు — చంచలం.
➡ పుష్పం — బుద్ధి — వికసించడం.
➡ తోయం — చిత్తం — నిర్మలం.
➡ ఫలం — అహంకారం — నారికేళం రెండు ముక్కలవడం.
అవి ధ్యానం వల్లనే సాధ్యం.
👉 ధ్యానంలో ‘మనస్సు’ యొక్క చంచలత్వం పోతుంది.
👉 అప్పుడు లభించే ప్రాణశక్తి వల్ల ‘బుద్ధి’ వికసిస్తుంది.
👉 అప్పుడు లోపల ఉన్న చెత్త ఆలోచనలు అన్ని పోయి ‘చిత్తం’ నిర్మలమవుతుంది.
👉 దానివల్ల నేను అనే ‘అహంకారం’ తొలగిపోతుంది.
అప్పుడే లోకానికి మేలు చేస్తాడు. అటువంటి వారే, పరమాత్మునికి ప్రీతి పాత్రులు అవుతారు.
How did this article make you feel? ఈ కథనం మీకు ఎలా అనిపించింది?


